సెలూన్లపై స్పెషల్‌ ఫోకస్‌

- March 13, 2020 , by Maagulf
సెలూన్లపై స్పెషల్‌ ఫోకస్‌

బహ్రెయిన్:ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా విషయమై సదరన్‌ మునిసిపాలిటీ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడుతోంది. పరిశుభ్రత విషయంలో మరిన్ని అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా, సెలూన్ల ద్వారా ఈ వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలున్నందున, సెలూన్లకు సంబంధించి క్లోజ్‌ మానిటరింగ్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే ప్రజల్లో అవగాహన కలిగేలా పలు కార్యక్రమాలు చేపట్టామనీ, వ్యక్తిగత పరిశుభ్రతే కీలకమైన అంశమనీ అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com