ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 23న విడుదలవుతున్న‘కె.జి.యఫ్ చాప్టర్ 2’
- March 13, 2020
సినిమా చరిత్రలో హిట్స్, సూపర్‌హిట్స్, బ్లాక్‌బస్టర్ చిత్రాలు వస్తుంటాయి. కానీ ట్రె్‌ండ సెట్టింగ్ మూవీస్ మాత్రం అరుదుగానే వస్తుంటాయి. అలాంటి అరుదైన ట్రెండ్ సెట్టింగ్ మూవీస్‌లో ‘కె.జి.యఫ్' ఒకటి. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ కన్నడ చిత్రసీమలో ‘కె.జి.యఫ్’ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలవడమే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సెన్సేషనల్ హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్‌ను సాధించింది. వసూళ్లలోనే కాకుండా అవార్డుల్లోనూ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ విజువల్ ఎఫెక్ట్, స్టంట్స్ విభాగాల్లో జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’కి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2‘ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌కి ప్రేక్షకులు, అభిమానుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. బాలీవు్‌డ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల యష్, సంజయ్ దత్, రవీనాటాండన్ సహా ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో మేజర్ షెడ్యూల్ పూర్తయ్యింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఫాన్ ఇండియా చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
రాకీ భాయ్‌గా యష్ రాకింగ్ పెర్ఫామెన్స్ చేయనున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!