ఐపీఎల్ వాయిదా..
- March 13, 2020
ముంబై: ఐపీఎల్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. కరోనా ఎఫెక్ట్‌తో బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాలని కేంద్ర క్రీడాశాఖ సూచించడంతో.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆలోచనలో పడ్డాయి. మరోవైపు మ్యాచ్‌ల నిర్వహణకు హర్యానా, ఢిల్లీ, ముంబై, కర్ణాటక నిరాకరించాయి. దీంతో రెండు వారాలు ఐపీఎల్‌ను వాయిదా వేయాలంటూ బీసీసీఐని ఫ్రాంచైజీలు కోరాయి. ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!







