కరోనా ఎఫెక్ట్:ఫెడరల్ స్టాఫ్ కోసం రిమోట్ వర్క్ సిస్టం అనౌన్స్ చేసిన యూఏఈ
- March 14, 2020
యూఏఈ:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు యూఏఈ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ సెక్టార్ లోని కొన్ని కేటగిరిలోని ఉద్యోగుల సెఫ్టీ కోసం రిమోట్ వర్క్ సిస్టమ్ ను అమలు పరుస్తోంది. రేపటి నుంచి రెండు వారాల పాటు ప్రభుత్వం సూచించిన ఫెడరల్ అథారిటీస్ లోని ఉద్యోగులు ఇక ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు ఉంటుంది. యూఏఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం 9వ గ్రేడ్ అంతకంటే తక్కువ గ్రేడ్ చదువుతున్న పిల్లల తల్లులు, ఎర్లడర్లీ ఎంప్లాయిస్, ప్రెగ్నెంట్ వుమెన్, వైకల్యాలు ఉన్న ఎంప్లాయిస్, ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉన్న ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసే ఫెసిలిటీ కల్పించనున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా అబుదాబి, దుబాయ్ ప్రభుత్వాలు తమ ఎమిరేట్ల ప్రభుత్వ రంగానికి రిమోట్ వర్క్ వ్యవస్థను ప్రకటించిన తర్వాతి రోజే యూఏఈ కూడా ఫెడరల్ అథారిటీ ఎంప్లాయిస్ కు రిమోట్ వర్క్ సిస్టంను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం