కువైట్:అత్యవసరం అయితే తప్ప జనంలోకి రావొద్దు..కువైట్ ప్రభుత్వ సూచన
- March 14, 2020
కువైట్:కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కువైట్ ప్రభుత్వం ఎప్పిటికప్పుడు వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటూ వస్తోంది. నిన్న ఒక్క రోజే 20 మందికి కరోనా పాజిటీవ్ అని నిర్దారణ కావటంతో కువైట్ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. వైరస్ వ్యాప్తికి ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా అన్ని విధాల కంట్రోల్ చేయటంపై మరింత ఫోకస్ పెంచింది. ఇకపై ప్రజలు ఎవరు అత్యవసరం అయితే తప్ప జనంలోకి రావొద్దని సూచించింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేలా జాగ్రత్తలు పాటించాలని కోరింది. కువైట్ మినిస్ట్రి ఆఫ్ ఇన్ఫర్మేషన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పబ్లిక్ గ్యాదరింగ్ ఈవెంట్స్ కు వీలైనంత వరకు దూరంగా ఉండాలని, అలాగే క్రౌడెడ్ ప్లేసెస్ కు, టూరిస్ట్ స్పాట్స్ కు వెళ్లకుండా ఉండటమే ఉత్తమమని సూచించింది. అయితే..ప్రభుత్వం సూచించిన డైరెక్షన్స్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మినిస్ట్రి ఆఫ్ ఇన్ఫర్మేషన్ కొట్టిపారేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు ఫిక్స్ డ్ టైం కండీషన్ అమలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, తాము అలాంటి ఆంక్షలు విధించలేదని క్లారిటీ ఇచ్చింది. కాకపోతే ప్రజలే సెల్ఫ్ డిసిషన్స్ తో పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ దూరంగా ఉండాలని కోరింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!