బహ్రెయిన్:లోన్ ఈఎంఐలు ఆలస్యమైనా ఫర్వాలేదు..
- March 14, 2020
బహ్రెయిన్:కరోనా వైరస్ బాధితులకు నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేసింది. తమ కస్టమర్లు లోన్స్ ఇన్స్ స్టాల్మెంట్ చెల్లింపుల్లో ఆలస్యమైనా ఫర్వాలేదని ప్రకటించింది. ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని లోన్ల ఈఎంఐ చెల్లింపుల్లో మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించింది. తమకు తమ కస్టమర్లు(కంపెనీలు లేదా వ్యక్తిగత ఖాతాదారులు) సోసైటీ సేఫ్టీ ఫస్ట్ ప్రియారిటీ అని ఎన్బీబీ ప్రకటించింది. కరోనా ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావం తమకు తెలుసని, ఈ డిఫికల్ట్ పరిస్థితుల్లో కస్టమర్స్ ఎదుర్కొంటున్న ఆర్ధిక సవాళ్లను తాము అర్ధం చేసుకోగలమని తెలిపింది. ఈ పరిస్థితుల్లో వారికి మద్దతుగా నిలబడాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన సూచనలను కూడా పాటిస్తూ లోన్ల వాయిదాలను డిడక్ట్ చేసుకోవటాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు బ్యాంక్ వర్గాలు స్పష్టం చేశాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







