కార్మిక బీమా వైద్యసేవలు
- January 23, 2016
కార్మిక బీమా వైద్యసేవలు (ఈఎస్‌ఐ) కార్డు కలిగిన వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఒక పర్యవేక్షణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పర్యవేక్షణ సంఘంలో 11 మంది సభ్యులతో పాలక మండలి, 8 మంది సభ్యులతో కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేయనుంది.పాలక మండలికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా, కార్య నిర్వాహక మండలికి రాష్ట్ర కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. వీటిలో సభ్యులుగా స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంఘాల నేతలకు చోటు కల్పిస్తారు.సంబంధిత ముసాయిదా ప్రతిపాదనలను రూపొందించి, అభిప్రాయాలు, సలహాలు సూచనలు కోరుతూ ఈఎస్‌ఐ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర కార్మిక శాఖకు లేఖ అందింది. నిధులు ఖర్చు చేయాలన్నా, కొత్తగా ఆస్పత్రులను విస్తరించాలన్నా, నియామకాలు జరపాలన్నా ఈ సంఘం నుంచే అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈఎస్‌ఐ వైద్య సేవలకు గాను ప్రస్తుతం కేంద్రం 87.5 శాతం నిధులు విడుదల చేస్తుండగా... దాన్ని 90 శాతానికి పెంచుతూ ఈఎస్‌ఐ కార్పొరేషన్ నిర్ణయించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







