కరోనా ఎఫెక్ట్: పొరుగుదేశాల సరిహద్దులు మూసేస్తున్న భారత్
- March 15, 2020
కరోనా విస్తరించకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన నరేంద్ర మోడీ సర్కార్... ఇప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పొరుగుదేశాల సరిహద్దులు కూడా మూసివేయాలని నిర్ణయించింది. భారత్-బంగ్లాదేశ్, భారత్-నేపాల్, భారత్-భూటాన్, భారత్-మయన్మార్ ఇలా అన్ని సరిహద్దుల వెంట రాకపోకలపై నిషేదాజ్ఞలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఇవాళ అర్థరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఒక, ఒక రోజు ఆలస్యంగా.. అంటే రేపటి అర్ధరాత్రి నుంచి భారత్-పాకిస్థాన్ సరిహద్దును కూడా మూసివేయనున్నారు. ఇక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల నుంచి వచ్చేవారిని సరిహద్దుల్లో కరోనా వైరస్ పరీక్షలు తప్పనిసరి చేస్తారు. అధికారిక వీసాలు కలిగిన రాయబారులు, యూఎన్ సిబ్బందిని మాత్రం భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని అట్టారి క్రాసింగ్ పాయింట్ వద్ద అనుమతిస్తారు. అదైనా వీరిని పూర్తిస్థాయిలో స్కానింగ్ చేసిన తర్వాత మాత్రమే అనుమతి ఉంటుంది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..