కరోనాతో పోరాటానికి అత్యవసర నిధి...

- March 15, 2020 , by Maagulf
కరోనాతో పోరాటానికి అత్యవసర నిధి...

కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంటే.. ఆయాదేశాలు కూడా తగినచర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావించారు. ఈ మేరకు సార్క్ దేశాధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్‌ను నివారించేందుకు అత్యవసర నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం భారతదేశం 10 మిలియన్ల అమెరికా డాలర్లతో నిధిని సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆదివారం సార్క్ దేశాధినేతలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వైరస్‌ను నిర్మూలన కోసం వైద్యులు, నిపుణులతోపాటు వైద్య పరీక్షల కోసం ఉపయోగించే కిట్లు, వస్తువులను సమకూరుస్తామని మోడీ తెలిపారు. ఏ దేశంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే వారిన అందజేయొచ్చు అని ప్రతిపాదించారు. భారతదేశంలో ఉపయోగించినట్టు వైరస్ నియంత్రణ కోసం ఇతరదేశాలకు కూడా సాయపడుతామని పేర్కొన్నారు. వైరస్ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ డీసిజ్ సర్వెలైన్స్ పోర్టల్ (ఐడీఎస్పీ)తో సార్క్ భాగస్వామమవుతోందని మోడీ పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు వేదికను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.

కరోనా వైరస్ నిర్మూలన కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ పనిచేస్తుందని మోడీ తెలిపారు. వైరస్ నిర్మూలన కోసం పనిేస్తున్నారని ఇండికేషన్స్ ఇచ్చారు. ఇతర దేశాలు, సంస్థలు కూడా సాయం చేయలని కోరారు. సార్క్ సదస్సులో వైరస్‌ను ఎదుర్కొనేందుకు నిధులు, కృషి చేస్తున్నామని మోడీ చెప్పి... ఇతర దేశాల మద్దతు కూడగట్టారు. సభ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు ఓకే ఆయా దేశాలు సానుకూలంగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com