కరోనావైరస్: యూఏఈ: ప్రయాణీకుల విమానాలు రద్దు..మాల్స్ మూసివేత మరియు స్టే-హోమ్ ఆర్డర్లు జారీ

- March 23, 2020 , by Maagulf
కరోనావైరస్: యూఏఈ: ప్రయాణీకుల విమానాలు రద్దు..మాల్స్ మూసివేత మరియు స్టే-హోమ్ ఆర్డర్లు జారీ

యూఏఈ: కొరోనా మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలిగొంటున్న విషయం తెలిసిందే. మరి దీన్ని నియంత్రించే క్రమంలో దేశాలన్నీ కూడా 'Stay at Home' (ఇంటి వద్దనే ఉండండి) అని అంటున్నాయి. తాజాగా యూఏఈ కూడా ప్రజలను తప్పనిసరైతే తప్పించి ఇంటి వద్దనే ఉందామంటూ పిలుపునిచ్చింది. 

రానున్న 48 గంటల్లో అన్ని ప్యాసింజర్ విమానాల రాకపోకలను నిలిపివేయనుంది. కార్గో మరియు అత్యవసర తరలింపు విమానాలు కొనసాగుతాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. మరియు మాల్స్ మూతబడనున్నాయి. సోమవారం తెల్లవారుజామున తీసుకున్న ఈ నిర్ణయం, కోవిడ్ -19 కి కారణమయ్యే వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దోహదపడుతుందని తెలిపిన అధికారులు. ఈ ఆంక్షలు రెండు వారాల పాటు ఉంటాయనీ, అవసరమైతే పొడిగించబడతాయి అని కూడా ధృవీకరించిన అధికారులు.

మాల్స్ మూతబడనున్నాయి కానీ సూపర్‌మార్కెట్లు, ఫార్మసీలు మరియు చేపలు, మాంసం మరియు కూరగాయల మార్కెట్లకు మినహాయింపు ఉంటుంది. హోటళ్లు కూడా మూతబడనున్నాయి కానీ హోమ్ డెలివరీ లు లభ్యమవుతాయి అని వివరణ ఇచ్చింది ప్రభుత్వం.

ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లవద్దని, పార్టీలు, కుటుంబ సమావేశాలు పరిమితం చేయాలనీ, ప్రజలు తమ సొంత వాహనాలను ఉపయోగించాలని, అయితే వారిలో ఉన్న వారి సంఖ్యను మూడుకి పరిమితం చేయాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆసుపత్రులను సందర్శించవద్దని ప్రజలను అర్ధించిన అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఎమర్జెన్సీ శాఖ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com