కార్మికులకు కోవిడ్ -19 పై అవగాహన కల్పిస్తున్న యూఏఈ వైద్యులు

- March 25, 2020 , by Maagulf
కార్మికులకు కోవిడ్ -19 పై అవగాహన కల్పిస్తున్న యూఏఈ వైద్యులు

అబుధాబి: ముస్సాఫా యొక్క ఇండస్ట్రియల్ ఏరియాలో కరోనా వైరస్ మహమ్మారి యొక్క ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి వైద్య నిపుణులు ప్రత్యేక శ్రద్ధ కనబరచారు. ప్రతి కార్మికుడికి వారి మాతృభాషలలో (హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం మరియు తెలుగు భాషలలో) ఆరోగ్య అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను వివరంగా చెప్తున్నారు. 

"కార్మికులు తమ పరిసరాల గురించి మరింత పరిశుభ్రంగా, ఆరోగ్య స్పృహతో ఉన్నారని వర్కర్స్ విలేజ్ ప్రక్కనే ఉన్న లైఫ్‌కేర్ హాస్పిటల్ స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ బైజు ఫైజల్ పుథెన్‌కోట్ అన్నారు. "కార్మికులకు ఇప్పుడు మరింత అవగాహన ఏర్పడింది. అంతకుముందు మైగ్రేన్, ఉదర మరియు శ్వాసకోశ సమస్యలను కరోనా వైరస్ అనుకొని ఆందోళన చెందారు. ఇప్పుడే మేము వారికి వాస్తవ లక్షణాలపై అవగాహన కల్పించాము. వైద్య నిపుణులు మాత్రమే కాదు, కార్మిక శిబిరాల్లో పర్యవేక్షకులు కూడా అవగాహన కల్పిస్తున్నారు" అని బైజు తెలిపారు.

ప్రామాణికమైన సమాచారాన్ని మాత్రమే అనుసరించండి
సోషల్ మీడియా లో దొరుకుతున్న చిట్కాలను గుడ్డిగా పాటించకండి అని కార్మికులను వైద్యులు హెచ్చరిస్తున్నారు. "కోవిడ్ -19 కి సంబంధించిన లక్షణాల గురించి చాలా మంది కార్మికులకు తెలిసినప్పటికీ, సోషల్ మీడియా చాలా తప్పుడు సమాచారం చూసి గాబరాపడి, ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోయినా/ఎటువంటి ప్రయాణం చేయకపోయినా/వ్యాధిగ్రస్తునితో సంబంధం లేకపోయినా 'కరోనా పరీక్ష' చేయండంటూ అభ్యర్థిస్తున్నారు. మేము ఆరోగ్య శాఖ యొక్క నవీకరించబడిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నాము" అని ముస్సాఫాలోని ఆస్టర్ క్లినిక్ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ రాజేష్ వెల్లికల్ తెలిపారు.

సొంత వైద్యం మహా ప్రమాదకరం 
అందరిలాగే కార్మికులు కూడా ఈ వైరస్ పై ఆందోళన చెందుతున్నారు. అయితే ఇక్కడ ప్రమాదం ఏంటంటే కార్మికులు 'ఓవర్ ది కౌంటర్' మందులు వాడటం. కార్మికులు తమ దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి సరైన మందులు వాడితే ఎటువంటి హాని ఉండదని వైద్యులు నొక్కి చెప్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com