కువైట్ సిటీ : ధరల నియంత్రణకు షాప్స్, సూపర్ మార్కెట్లపై అధికారుల పర్యవేక్షణ

కువైట్ సిటీ : ధరల నియంత్రణకు షాప్స్, సూపర్ మార్కెట్లపై అధికారుల పర్యవేక్షణ

కరోనా వైరస్ కారణంగా సరుకుల కొరతను సొమ్ము చేసుకోవాలనే వ్యాపారులపై కామర్స్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తనఖీ టీమ్స్ దాదాపు 151 సహాకార సంఘాలు, సూపర్ మార్కెట్లు, వ్యాపార దుకాణాలు, కూరగాయల షాపులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వినియోగదారులకు తగిన ధరల్లో నిత్యావసర సరుకులు అందించటమే లక్ష్యంగా తమ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని వారు వెల్లడించారు. అంతేకాదు లబ్ధిదారులకు సరైన విధంగా ఆహార సామాగ్రి అందించేందుకు తనిఖీ టీమ్స్ 39 క్యాటరింగ్ బ్రాంచులను టేకోవర్ చేసుకున్నాయి. అలాగే 8 బేకరిలను కూడా తమ శాఖకు అనుసంధానం చేశాయి. ఇప్పటివరకు అత్యవసర సేవా కేంద్రానికి 135 హాట్ లైన్ ద్వారా 265 ఫిర్యాదులు అందాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను సొంత లాభాలకు వాడుకోవాలని చూసే వ్యాపారుల పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. 

 

Back to Top