కరోనా ఎఫెక్ట్:దుబాయ్ లో ఇక నుంచి ట్యాక్సీలో ఇద్దరికే అనుమతి
- March 26, 2020
దుబాయ్:కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దుబాయ్ రవాణా శాఖ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్యాక్సీ ఇద్దరికి మించి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ఒక ట్యాక్సీలో డ్రైవరుతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతించనున్నారు. అలాగే బస్, మెట్రోలో కూడా ప్రయాణికులు నిర్దిష్ట దూరాన్ని పాటించాలని సూచించారు. బస్ రియర్ డోర్ ను మూసి ఉంచి ముందు వెనక డోర్ల ద్వారా ప్యాసింజర్లను అనుమతిస్తారు. అయితే..బస్ షెల్టర్ లు మాత్రం తాత్కాలికంగా మూసివేసే ఉంటాయి. ప్రయాణికుల అవసరం మేరకు మెట్రో సర్వీసు ట్రిప్పుల సంఖ్యను పెంచనున్నారు. పీబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రైడర్లు వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వినియోగించకపోవటమే మేలని ఆర్టీఏ అధికారులు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాల మేరకు దుబాయ్ ఆర్టీఏ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!