ప్రపంచ వ్యాప్తంగా మరింత పెరిగిన కరోనా మరణాలు

- March 26, 2020 , by Maagulf
ప్రపంచ వ్యాప్తంగా మరింత పెరిగిన కరోనా మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మరింత పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 21,295కి చేరింది. కరోనా పాటిజివ్‌ కేసులు 4,17,417 నమోదు అయ్యాయి. ఇటలీలో అత్యధికంగా 74,386 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,503 కరోనా మరణాలు సంభవించాయి. అమెరికాలో 68,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 940 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో ఒక్కరోజే 738 మంది మృతి చెందారు. కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నప్పటికీ క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 బిలియన్ల మంది ఇంటికే పరిమితమయ్యారు. కొన్ని దేశాల్లో కరోనాపై అప్రమత్తంగా లేని కారణంగానే బాధితుల సంఖ్య పెరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com