భారత్‌, బహ్రెయిన్‌ స్నేహబంధం

- January 24, 2016 , by Maagulf
భారత్‌, బహ్రెయిన్‌ స్నేహబంధం

ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా, గుడైబియా ప్యాలెస్‌లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కి స్వాగతం పలికారు. అరబ్‌ - ఇండియన్‌ కోఆపరేషన్‌ ఫోరమ్‌ సమావేశానికి హాజరయ్యేందుకు సుష్మాస్వరాజ్‌ బహ్రెయిన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తరఫున బహ్రెయిన్‌ ప్రైమ్‌ మినిస్టర్‌కి గ్రీటింగ్స్‌ తెలియజేశారు సుష్మా స్వరాజ్‌. బహ్రెయిన్‌ - భారత్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఇంకా మెరుగుపడవలసి ఉందనీ, వ్యాపారాత్మక కోణంలో ఇరు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే వైఖరి బలోపేతమవడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఇరువురూ వ్యాఖ్యానించారు. బహ్రెయిన్‌ ప్రగతిలో భారత వలసదారుల కృషిని ఈ సందర్భంగా ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా చెప్పారు. బహ్రెయిన్‌లో భారత్‌ - బహ్రెయిన్‌ పౌరుల మధ్య సఖ్యత చాలా గొప్పతని ఆయన అన్నారు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com