కరోనా పై యుద్ధానికి ప్రభాస్ 4 కోట్ల విరాళం
- March 27, 2020
కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ తీవ్ర భయాందోళనలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి మరింతగా ప్రబలకుండా ఉండాలని ఎక్కడికక్కడ ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి పలు దేశాలు. మన భారత దేశంలో కూడా ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది.
ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనాపై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పీఎమ్ రిలీఫ్ ఫండ్‌కి 3 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షల రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షల రూపాయలు, మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సూచన మేరకు సోషల్ డిస్టెన్స్ పాటించాలని, అందరూ సురక్షితంగా తమ ఇళ్ల వద్దనే ఉండాలని ప్రభాస్ ప్రజలను కోరారు ప్రభాస్. ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న డార్లింగ్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!







