కువైట్:రెసిడెన్సీ ఉల్లంఘించినవారికి జరిమానా లేదు
- March 27, 2020
కువైట్:కరోనా వైరస్ ను నియంత్రించేందుకు గల్ఫ్ కంట్రీస్ వీలైనన్ని చర్యలు చేపడుతున్నాయి. ప్రవాసీయులను వీలైనంత వరకు తమ దేశాలకు పంపించేలా నిబంధనలను సడలిస్తున్నాయి. సౌదీ ప్రభుత్వం 250 మంది ప్రవాస ఖైదీలను విడిచిపెడితే...లేటెస్ట్ గా కువైట్ ప్రభుత్వం కూడా ప్రవాసీయులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కువైట్ లోని ఉంటున్న ప్రవాసీయులు...రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించినా జరిమానా చెల్లించక్కర్లేదని ప్రకటించింది. అయితే..ఏప్రిల్ 1 నుంచి 30 లోగా వారు తమ తమ దేశాలకు తిరిగి వెళ్లిన వారికి మాత్రమే ఈ మినహాయింపు ఇచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాక న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసుకొని తిరిగి కువైట్ రావొచ్చని కూడా స్పష్టం చేసింది. అయితే..రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు ఉంటే మాత్రం ప్రవాస వ్యవహారాల సాధారణ పరిపాలన విభాగం అధికారులను సంప్రదించాలని సూచించింది. అంతేకాదు ఏప్రిల్ 1 నుంచి 30 లోగా దేశం విడిచిపెట్టి వెళ్లని ప్రవాసీయులు జరినామా చెల్లించటంతో పాటు దేశ బహిష్కరణ కూడా ఎదుర్కొవాల్సి వస్తుందని కూడా కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు