కరోనా ఎఫెక్ట్:250 మంది ప్రవాస ఖైదీలను విడుదల చేసిన సౌదీ
- March 27, 2020
సౌదీ:గల్ఫ్ దేశాల్లో మహమ్మారి కరోనావైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో సౌదీ ప్రభుత్వం కరోనా వ్యాప్తి, నివారణకు కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా దేశంలోని పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న దాదాపు 250 ప్రవాస ఖైదీలను విడుదల చేసింది. వీరందరూ ఇమ్మిగ్రేషన్, రెసిడెన్సీ నేరాలలో జైలులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జైలులో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ 250 మందిని విడుదల చేసినట్టు మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు అవద్ అల్ అవద్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది ఖైదీలను విడుదల చేసే దిశగా సౌదీ ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా ఆయన చెప్పారు. ప్రజా ఆరోగ్య సంరక్షణ విషయంలో సౌదీ ప్రభుత్వం ఏ మాత్రం రాజీ లేకుండా పోరాడుతుందని ఈ నిర్ణయంతో మరోసారి చాటుకుందని అవద్ అల్ అవద్ అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







