రియాద్:ఉద్యోగులకు సెలవులు... అన్ని ఫ్లైట్ సర్వీసుల రద్దు కొనసాగింపు
- March 29, 2020కరోనా కట్టడికి సౌదీ అరేబియా ప్రభుత్వం చేపట్టిన చర్యలను మరికొద్ది రోజులు పొడగించింది. అన్ని అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను రద్దు కాలాన్ని పొడగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రద్దు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే అత్యవసర విభాగాలు మినహా అన్ని గవర్నమెంట్ కార్యాలయాల్లో ఉద్యోగులకు సెలవులను కూడా పొడగించింది. ఈ నిబంధనలు ప్రైవేట్ సెక్టార్ కు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇదిలాఉంటే కింగ్ డమ్ లో బస్, టాక్సీ, ట్రైన్ సర్వీసులను ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఈ ఏడాది తొలి మాసం నుంచే సౌదీ ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తూ వస్తోంది. వాటికి కొనసాగింపుగానే ప్రస్తుత నిర్ణయం తీసుకుంది. ఇంతటి కఠిన నిర్ణయాల కారణంగా కరోనా మృతుల సంఖ్యను అదుపు చేయగలుగుతోంది. సౌదీలో కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్