కరోనా ఎఫెక్ట్:రోగుల కోసం రక్త దానం చేయాలని ఒమన్ ప్రభుత్వం పిలుపు
- March 29, 2020
కరోనా కారణంగా రోగులకు చికిత్స ఆగిపోకుండా ఒమన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుంది. రోగుల కోసం ప్రజలు రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్ సేవల విభాగం అధికారులు పిలుపునిచ్చారు. రక్త దానం చేయాలనుకునేవారు బవ్షర్ బ్లడ్ బ్యాంక్ కేంద్రంలో రక్తం ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అలాగే గవర్నరేట్ పరిధిలోని స్థానిక బ్లడ్ బ్యాంక్ కేంద్రాల్లో కూడా రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రక్త దానం చేయాలనుకునే వారు 94555648కి ఫోన్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఇతర రోగులకు చికిత్స ఆగిపోకుండా ఉండేందుకు ఈ చర్యలను చేపట్టారు. అయితే..వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని రక్త దాన శిబిరాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా డీబీబీఎస్ అధికారులు చెప్పారు. పరిమిత సంఖ్యలోనే రక్త దానం చేసేవారిని శిబిరాలకు అనుమతిస్తారు. ముందస్తుగా బుక్ చేసుకున్న టైం స్లాట్స్ ప్రకారం అనుమతిస్తారు. అంతేకాదు..కోవిడ్ ప్రభావిత ప్రాంతాల వారు, వైరస్ సోకిన పేషెంట్లతో కాంటాక్ట్ అయిన వారి విషయంలో కొన్ని షరతులు విధించారు. బ్లడ్ డొనేట్ చేసే సమయానికి 28 రోజులు గడిచి ఉంటేనే వారి నుంచి రక్తం సేకరిస్తారు. అలాగే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు కోలుకున్న మూడు నెలల తర్వాతే రక్త దానం చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?