కరోనా క్రైసిస్ చారిటీకి యంగ్ హీరో సందీప్ కిషన్ రూ. 3 లక్షల విరాళం
- March 30, 2020
పేద సినీ కళాకారులు, కార్మికులను ఆదుకోవడంలో యువ కథానాయకుడు సందీప్ కిషన్ భాగస్వాములయ్యారు. ప్రస్తుతం నడుస్తున్న సంక్షోభ కాలంలో సినిమా షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సినీ కార్మికులకు చేయూత నిచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ఛైర్మన్‌గా ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి సందీప్ కిషన్ రూ. 3 లక్షలు విరాళంగా ప్రకటించారు. దీంతో పాటు 'వివాహ భోజనంబు' రెస్టారెంట్లలో పనిచేస్తున్న 500కు పైగా ఉద్యోగుల బాగోగులను సైతం ఆయన చూసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం కీలక దశలో ఉందనీ, దీన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్‌ను అందరూ గౌరవించాలనీ, వైద్యులు, పోలీసుల సూచనలను పాటిస్తూ, అందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ సందీప్ కిషన్ కోరారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..