కరోనా ఎఫెక్ట్:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 75 శాతం కోత

- March 30, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్:తెలంగాణ ప్రభుత్వ  ఉద్యోగుల వేతనాల్లో 75 శాతం కోత

హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై కరోనా ఎఫెక్ట్‌ గట్టిగానే పడింది. ఉద్యోగుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో కూడా 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అఖిలభారత సర్వీస్‌ అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించనున్నారు. ఇక మిగిలిన కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించనున్నారు. అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం, నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత విధించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com