కరోనా ఎఫెక్ట్:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 75 శాతం కోత
- March 30, 2020
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఉద్యోగుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో కూడా 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అఖిలభారత సర్వీస్ అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించనున్నారు. ఇక మిగిలిన కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించనున్నారు. అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం, నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత విధించనున్నారు.
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం