కరోనా/యూఏఈ: 2021 కు వాయిదా పడనున్న ఎక్స్‌పో 2020

- March 30, 2020 , by Maagulf
కరోనా/యూఏఈ: 2021 కు వాయిదా పడనున్న ఎక్స్‌పో 2020

దుబాయ్: కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి చూస్తున్నాం. కరోనా ధాటికి ఇప్పటికే టోక్యో లో జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదాపడ్డ సంగతి విదితమే. దుబాయ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అతిపెద్ద ఈవెంట్ 'Expo 2020'. దీనికి గాను దుబాయ్ ఎంతో వ్యయప్రయాసలకు లోనై ప్రపంచపు అతిపెద్ద ఎక్స్పో గా తీర్చిదిద్దెందుకు సర్వ సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు దుబాయ్ చేపడుతున్న ఈ Expo కి ఎదురుదెబ్బ కరోనా రూపంలో ఎదురైంది. 

ఈరోజు సాయంత్రం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కరోనా వ్యాపించకుండా కట్టడి చేసేందుకు ఈ ఎక్స్పో ను ఒక సంవత్సరం పాటు వాయిదావేయాలని యూఏఈ కి ఇతర దేశాలు సిఫారసు చేశాయి. ఈ ప్రతిపాదనకు యూఏఈ తన మద్దతు ప్రకటించింది, కానీ, పాలకమండలి కొన్ని ప్రక్రియలను అనుసరించి జనరల్ అసెంబ్లీ నుండి మూడింట రెండు వంతుల మెజారిటీ ఓటు పొందిన తర్వాతే ఎక్స్పో వాయిదాపై తుది నిర్ణయం ఉంటుంది అని యూఏఈ  ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com