కరోనా పై యుద్ధం చేస్తున్న పోలీస్ సోదరులకి భారీగా శానిటైజర్స్ అందించిన నిఖిల్
- March 31, 2020
మహామ్మారి కరోనా పై యావత్ ప్రపంచం యుద్ధం చేస్తోంది. మన దేశంలో కూడా 21 లాక్ డౌన్ ప్రకటించి కరోనా నివారణకు అన్ని విధాల కార్యచరణలు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమైతనప్పటికీ డాక్టర్లు, పోలీస్ అధికారులు, హెల్త్ డిపార్ట్ మెంట్ సిబ్బంది పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా మనందరి కోసం పని చేస్తున్నారు. ముందుగా వారందరి సురక్షణ మనందరి ప్రధమ కర్తవ్యం. అందుకే వివిధ రంగాలకు చెందిన ప్రముఖలంతా పోలీస్, వైద్య సిబ్బందికి చేయూతగా తమకు తోచిన సహాయసహకారాలు అందిస్తున్నారు. తెలుగు చిత్రసీమ నుంచి కూడా కొందరు హీరోలు, నిర్మాతలు ఇప్పటికే కరోనా నివారణకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాకారం అందిస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్ సైతం ఇటీవలే 8 లక్షల విలువ చేసే మాస్కులు, శానిటరీ కిట్లు వివిధ ఆసుపత్రుల్లో ఉన్న వైద్యలుకు అందించారు. తాజాగా వివిధ ఏరియాల్లో డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు అందజేశారు. ఈ పరంపర ఇంకా కొనసాగిస్తున్నట్లుగా నిఖిల్ సిద్ధార్థ తెలిపారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..