కోవిడ్ 19: ఫ్యాక్టరీ వర్కర్స్‌కి సేఫ్టీ గైడ్‌లైన్స్
- March 31, 2020
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కోవిడ్19 (కరోనా వైరస్) నేపథ్యంలో ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి సంబంధించి ఫ్యాక్టరీ వర్కర్స్‌కి స్పష్టమైన గైడ్‌లైన్స్ జారీ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ రిమోట్ పద్ధతిలో పనిచేయాల్సి వుంటుంది. అకౌంటెంట్స్ మరియు కో-ఆర్డినేటర్స్‌కీ ఇదే పద్ధతి అమలు చేయాలి. వారి కార్యాలయాల్ని ఎంప్లాయీస్ క్వార్టర్స్‌గా మార్చాలి. ఫ్యాక్టరీ పరిసరాల్లో వుండాల్సిన అవసరం వున్న కార్మికులు, కరోనా వైరస్ వ్యాప్తి తగ్గేవరకూ అక్కడే వుండేలా ఏర్పాట్లు చేయాల్సి వుంటుంది. వర్కర్స్‌కి సంబంధించిన పేర్లు, ఫోన్ నెంబర్స్ సంబంధిత అధికార వర్గాలకు అందించాలి. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ప్రయాణించే ట్రక్ డైవర్స్ వివరాలు పొందు పర్చాల్సి వుంటుంది. ప్రొటెక్టివ్ క్లాతింగ్, మాస్క్ అలాగే గ్లోవ్స్‌ని డ్రైవర్లు ధరించక తప్పదు. ఇండస్ట్రియల్ ఏరియా లేదా ఫ్రీ జోన్‌లోకి ట్రక్ ఎంటరయ్యాక దాన్ని డ్రైవర్ విడిచి వుండకూడదు. స్పెషలైజ్డ్ పస్రనల్, లోడింగ్ అలాగే అన్‌లోడింగ్ ప్రక్రియలు చేపడతారు. వీరికీ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ తప్పదు. ఈ తరహా గైడ్ లైన్స్‌ని విడుదల చేసిన మినిస్ట్రీ, ప్రతి ఒక్కరూ తప్పక వీటిని పాటించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!







