ఏ.పి:రెండు విడతల్లో మార్చినెల జీతం
- March 31, 2020
ఏపీలో కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. దీంతో మార్చినెల జీతాలు, పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్ధితి ఉంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు, వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు తెలిపారు. ఈ మేరకు తనను కలిసిన ప్రభుత్వం ఉద్యోగులసంఘం నేత సూర్యనారాయణకు సీఎం జగన్ ఈ విషయం చెప్పారు. మార్చి నెలకు గానూ చెల్లించాల్సిన వేతనాలను రెండు విడతల్లో చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అన్ని ప్రభుత్వశాఖల నుంచి వచ్చే ఆదాయనికి తీవ్రంగా గండిపడింది. నెలనెలా రావాల్సిన పన్నులతో పాటు మైనింగ్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ ఆదాయాలు కూడా నిలిచిపోయాయి. దీంతో వేల కోట్ల రూపాయల రాబడి పోయినట్లయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల నుంచి తాజా వివరాలు తీసుకున్న ప్రభుత్వం రోజుకు రెండు కోట్ల రూపాయల ఆదాయం కూడా రావడం లేదని తేల్చింది. ఇలాంటి పరిస్ధితుల్లో ఉద్యోగుల వేతనాలు, జీతాలు, పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం తరహాలో కోతలు పెట్టకుండా రెండు విడతల్లో జీతాలు, వేతనాలు, పింఛన్లు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఉద్యోగసంఘాల తరఫున 100 కోట్ల నిధులను ప్రభుత్వానికి ఇచ్చిన ఉద్యోగులు.. రెండు విడతల జీతానికి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు