దోహా:నిర్మాణ రంగంలోని కార్మికులకు ఆరోగ్య సంరక్షణ కిట్ల పంపిణి

- March 31, 2020 , by Maagulf
దోహా:నిర్మాణ రంగంలోని కార్మికులకు ఆరోగ్య సంరక్షణ కిట్ల పంపిణి

దోహా:పలు దేశాల నుంచి వచ్చిన నిర్మాణ రంగ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఖతార్ స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చింది. పలు ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులకు మెడికల్ కిట్లను ఉచితంగా అందించింది. కరోనా వైరస్ శరవేగంగా ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో దేశంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ ముఖ్యమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. హెల్త్ కిట్లతో పాటు కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ వివిధ భాషల్లో పాంప్లేట్లను కూడా పంచిపెట్టారు. కరోనా వైరస్ నుంచి ఎవరికి వారు ఎలా రక్షించుకోవాలో...ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కార్మికులకు అవగాహన కల్పించినట్లు దుబాయ్ ఛారిటీ తమ ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. కార్మికులకు మెడికల్ కిట్లను అందించే ఈ కార్యక్రమంలో కార్మిక పర్యవేక్షణ విభాగం డైరెక్టర్ ఫాహద్ అల్ దోసరి పాల్గొన్నారు. 

--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com