కరోనా ఎఫెక్ట్:అబుధాబిలో సరుకుల రవాణాకు ఉచిత ట్యాక్సీ..రిటైలర్లకు ఊరట

- April 01, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్:అబుధాబిలో సరుకుల రవాణాకు ఉచిత ట్యాక్సీ..రిటైలర్లకు ఊరట

అబుధాబి మున్సిపాలిటీ రిటైల్ షాపు ఓనర్లకు ఊరటనిచ్చేలా ఉచిత ట్యాక్సీలు అందిస్తోంది. ఆన్ లైన్ ఆర్డర్స్ మేరకు రిటైలర్స్ తమ సరుకులను మున్సిపాలిటీ ట్యాక్సీల ద్వారా ఇక నుంచి ఉచితంగా హోమ్ డెలివరీ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. 600535353 ద్వారా రిజిస్టర్ చేసుకున్న రిటైలర్లు ట్యాక్సీ యాప్ ద్వారా అబుధాబి మున్సిపాలిటీ సమకూర్చే వాహనాలను వాడుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా...తాము అందిస్తున్న ట్యాక్సీ డ్రైవర్స్ కి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని కూడా చెప్పారు. వినియోగదారులకు సరుకులు సరఫరా చేసే సమయంలో డ్రైవర్లు విధిగా మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు ధరించటంతో పాటు ఇత శానిటైజ్ విధానాలను కూడా పాటించేలా శిక్షణ కూడా ఇచ్చామని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇటీవల ఆన్ లైన్ ఆర్డర్స్ విపరీతంగా పెరిగిపోయిన  సంగతి తెలిసింది. దీంతో వినియోగదారులు అందరికీ తమ సొంత వాహనాల్లో సరుకుల రవాణా చేయటంలో రిటైలర్లు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పైగా సరుకుల సరఫరా ఆలస్యంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అబుదాబి మున్సిపాలిటీ రవాణా విభాగం ఉచితంగా ట్యాక్సీలను అందిస్తోంది. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com