హైదరాబాద్:గాంధీ ఆస్పత్రిలో కరోనా మరణం..
- April 02, 2020
తెలంగాణలో మరో కరోనా మరణం చోటుచేసుకుంది. బుధవారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 50 ఏళ్ల కరోనా బాధితుడు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది. అయితే అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు కరోనా వార్డులోకి వెళ్లేందుకు వెనుకంజ వేశారు. అయితే సీపీ అంజనీకుమార్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితని చక్కదిద్దారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
కాగా, నిర్మల్ పట్టణానికి చెందిన అన్నదమ్ముళ్లు కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. వీరిద్దరు కూడా ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే చికిత్స పొందుతూ ఓ వ్యక్తి నేడు మరణించాడు. సోదరుడి మృతితో ఆగ్రహానికి లోనైన మరో వ్యక్తి వైద్యులపై దాడికి దిగాడు. ఈ ఘటనను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. ఇలాంటి కష్ట సమయంలో వైద్యులపై దాడి సరికాదని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆయన మంత్రిని కోరారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు