కరోనా ఎఫెక్ట్: ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల లెటర్ ఉంటేనే ఉద్యోగులకు అనుమతి.
- April 02, 2020
మస్కట్:కరోనా వైరస్ కారణంగా దేశమంతా కర్ఫ్యూ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఒమన్ భద్రతా అధికారులు ఉద్యోగుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేట్ ఉద్యోగులైనా తప్పనిసరిగా తమ సంస్థల నుంచి లెటర్ తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా సంస్థల సీల్ తో పాటు సదరు ఉద్యోగి ఏ తరహా విధులు నిర్వహిస్తున్నాడు..ఎందుకోసం అతని సేవలు అత్యవసరమని భావిస్తున్నారో కూడా లేఖలో పేర్కొనాలని కోరారు. దేశ పౌరులతో పాటు నివాసితులు(రెసిడెంట్స్) లెటర్ తో పాటు తమ సివిల్, ఐడీ కార్డులను తప్పకుండా వారితోనే ఉంచుకోవాలని కూడా అధికారులు సూచించారు. దేశంలో పలు చోట్ల రాయల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రాయల్ ఒమన్ పోలీసులు సంయుక్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉద్యోగులు సంబంధిత డాక్యుమెంట్లు చూపిస్తేనే అనుమతిస్తారని అధికారులు స్పష్టం చేశారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు