కరోనా: యూరప్‌లో 30 వేల మంది మృతి
- April 02, 2020
పారిస్: కరోనా వైరస్ కారణంగా యూరప్ లో మరణించిన వారి సంఖ్య బుధవారానికి 30 వేలకు చేరుకుంది. అందులో ఇటలీ, స్పెయిన్ లోనే అధికంగా మరణాలు నమోదయ్యాయి. మొత్తం 4,58,601 కేసులకు గానూ 30,063 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఒక్క ఇటలీలోనే 12,428 మంది మరణించగా, స్పెయిన్ 8,189 మంది, ఫ్రాన్స్ లో 3,523 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 40 వేల మంది మరణించారు.
ఆయా దేశాల్లో..
స్పెయిన్ ఇప్పటికే ఆస్పత్రుల్లోని బెడ్లను 20 శాతం పెంచింది. పదుల సంఖ్యలో హోటళ్లను రికవరీ గదులుగా మార్చింది. క్రీడా కేంద్రాలు, లైబ్రరీలు, ఎగ్జిబిషన్ సెంటర్లను కూడా ఆస్పత్రులుగా మలచేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తగినన్ని ఐసీయూ యూనిట్లు లేకపోవడంతో పరిస్థితిని అదుపు చేయడం కష్టమవుతోంది. ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తమ దేశాల్లోని మెడికల్ విద్యార్థులను, రిటైర్డ్ వైద్యులను, చివరకు విమానాల్లోని మెడికల్ సిబ్బందిని కూడా కరోనా రోగుల కోసం రావాల్సిందిగా పిలుపునిస్తున్నారు. ఇప్పటికే ఇటలీలో 10 వేల మంది వైద్య సిబ్బందికి, 60 మంది వైద్యులకు కూడా కరోనా సోకింది. మరోవైపు పారిస్ గత వారమే తమ ఆస్పత్రులలోని ఐసీయూ బలాన్ని రెండింతలు చేసింది. అవన్నీ కూడా రోగులతో నిండిపోయాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్‌లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్‌లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్‌లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







