ఆదాయం తగ్గిపోయింది...ఆదుకోండి: జగన్
- April 02, 2020
అమరావతి: కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి.. కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరించారు. గడచిన రెండు రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను వెల్లడించారు.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన 132 కరోనా పాజిటివ్ కేసుల్లో 111 మంది జమాత్‌కు వెళ్లిన వారు, వారితో కాంటాక్టులో ఉన్నావారేనని సీఎం తెలిపారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను ప్రధానికి వివరించారు. బాధితులను క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి వైద్య సదుపాయాలు అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని, తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. వైద్య పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు