ఇండియా: ఏప్రిల్ 15న లాక్డౌన్ ఎత్తివేత
- April 02, 2020
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రంగాలు తీవ్ర నష్టాలను ఎదర్కొంటున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడిగించే అవకాశం ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏప్రిల్ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తారా..? లేదా అనే ప్రశ్న అనేక మందిలో ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
అయితే ఈ సమావేశం అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖండూ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ప్రధానిలో సమావేశం అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ ఏప్రిల్ 15న లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్లు తెలిపారు. కానీ ప్రజలంతా బయటకు రావడానికి కొన్ని పరిమితులు మాత్రం ఉంటాయని పేర్కొన్నారు. అలాగే లాక్డౌన్ ఎత్తివేసినా.. సామాజిక దూరంతో మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించగలమని వివరించారు. సీఎం ట్వీట్‌తో ఏప్రిల్ 15న లాక్డౌన్ ఎత్తివేస్తారని అర్థమవుతోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు