దుబాయ్:గడువు ముగిసన హెల్త్ కార్డుల చెల్లుబాటు..డీహెచ్ఏ ప్రకటన
- April 03, 2020దుబాయ్:మీ హెల్త్ కార్డుల గడువు ముగిసినా చింతిచాల్సిన పని లేదు. హెల్త్ కార్డుల గడువు ముగిసినా మరో మూడు నెలల పాటు చెల్లుబాటులోనే ఉంటాయని దుబాయ్ ఆరోగ్య శాఖ అధికార వర్గాలు(DHA) వెల్లడించాయి. ఈ మేరకు ఆరోగ్య సేవలు అందించే సంస్థలకు డీహెచ్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. హెల్త్ కార్డుల గడువు ముగిసిందనే కారణంగా ఏ ఒక్క పేషెంట్ కు చికిత్స ఆపకూడదని కూడా హెచ్చరించింది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో హెల్త్ కార్డుల గడువు పెంపు ఎంతో మందికి ప్రయోజనకరంగా మారనుందని డీహెచ్ఏ వెల్లడించింది. ప్రజల బాగోగుల, ఆరోగ్య సంరక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంరక్షణ కోసం అవసరమైన జాగ్రత్తలు, నివారణ చర్యలు ఎప్పటికప్పుడు అమలు చేస్తూనే ఉంటామని డీహెచ్ఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం….17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు