ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు
- April 03, 2020
కరోనా వైరస్‌ను తరిమివేయడానికి ఈ ఆదివారం ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు మీ అందరి 9 నిమిషాలు అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటిలోని లైట్లను ఆపివేసి బాల్కానీలో నిలబడి క్యాండిల్ వెలిగించండి. లేకపోతే మొబైల్ ఫ్లాష్ లైట్ వెలిగించండి. దేశమంతా నాలుగువైపుల వెలుగు నింపుదాం. ఆ వెలుగులో మనమంతా సంకల్పం చేసుకుందాం. మనం ఒంటరిగా లేం. 130 కోట్ల దేశప్రజలంతా కలిసి వున్నాం.
రోడ్ల మీదకు, గల్లీలోకి వెళ్లవద్దు. సమాజిక దూరం పాటిస్తూ వెలుగు వెలిగించాలి. కరోనా చైన్‌ను విరగగొట్టడానికి రామబాణం లాంటిది సమాజిక దూరం. ఈ విపత్కర పరిస్థితుల్లో మనోధైర్యం విజయాన్ని కలిగిస్తోంది. ఉత్సాహం, స్పూర్తి కంటే పెద్ద శక్తి ప్రపంచంలో మరేదీ లేదు. మనోధైర్యానికి మంచిన శక్తి లేదు. అందరం కలిసి కట్టుగా కరోనాను ఓడించుదాం. అంటూ ప్రధానమంత్రి మోదీ వీడియో సందేశం ఇచ్చారు.
కరోనా డెడ్లీ వైరస్ కారణంగా లాక్‌డౌన్ 9 రోజులైంది. ప్రజలు, అధికారులు అందరూ సమిష్టిగా సహకరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ రోజు ఎన్నో దేశాలు మనం అనుసరించిన విధానాన్ని అనుసరిస్తున్నారు. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్, చప్పట్లు కొట్టడం ఇవన్నీ ఇతర దేశాలు అనుసరిస్తున్నాయి.
దేశమంతా కలిసి కట్టుగా కరోనాపై యుద్ధంచేస్తున్నాం. ఇదొక చారిత్మకఘట్టంగా పి.ఎం. అభివర్ణించారు.
ఇంత పెద్ద యుద్ధం ఎన్ని రోజులు చేయాలి? అనే ప్రశ్నలు వస్తున్నాయి. లాక్‌డౌన్ సమయం ఇది. మనం మన ఇండ్లలో వున్నాం. అంత మాత్రాన మనం ఒంటరివారం కాదు. మొత్తం 130 కోట్ల మంది సమిష్టిగా వున్నాం. సమిష్టిగా కరోనాపై యుద్ధం చేస్తున్నాం. ప్రజలు భగవంతుని స్వరూపం అంటారు. ఆత్మస్థైర్యం, మనోబలంతో కరోనా మహమ్మారిని ఎదుర్కోందాం.
పేదలపై కరోనా దుష్‌ప్రభావం తీవ్రంగా వుంది. వారిలో ఆత్మస్థైర్యం నింపవల్సిన సమయం ఆసన్నమైంది. కరోనా వైరస్‌ను తరిమివేయడానికి ఈ ఆదివారం ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు మీ అందరి 9 నిమిషాలు అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటిలోని లైట్లను ఆపివేసి బాల్కానీలో నిలబడి క్యాండిల్ వెలిగించండి. లేకపోతే మొబైల్ ఫ్లాష్ లైట్ వెలిగించండి. వెలుగు నింపుదాం. ఆ వెలుగులో మనమంతా సంకల్పం చేసుకుందాం. అందరం కలిసి కట్టుగా కరోనాను ఓడించుదాం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు