కరోనా ఎఫెక్ట్:నిత్యావసర సరుకులు అందించిన సంఘ సేవకులు
- April 03, 2020
దుబాయ్: కరోనా ప్రభావంతో దుబాయ్ లోని సోనాపూర్ లో నరకయాతన పడుతూ గత మూడు నెలలుగా తినడానికి తిండిలేక ఉండడానికి వసతిలేక మసీదు ప్రక్కన చెట్టు క్రిందనే పడుకుంటూ గల్ఫ్ జీవితాన్ని సాగిస్తున్న తెలుగు రాష్ట్రాల సోదరులను గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక(GWAC) ఆధ్వర్యంలో వసతి,కావాల్సిన నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సహాయం అందించారు.అలాగే వాళ్ళందరూ ఇంటికి వెళ్లెవరకూ అండగా ఉంటామని సోషల్ సర్వీస్ ఫర్ గల్ఫ్ ఇండియన్ అధ్యక్షులు జైత నారాయణకు మద్దతు తెలిపారు.
వారిని కలిసినవారిలో GWAC అధ్యక్షులు కృష్ణ దోనికేని, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రేండ్ల, కేంద్ర కమిటీ సభ్యులు మల్లేష్ గౌడ్ కోరేపు, సారంగుల నారాయణ,నిరంజన్ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ రంజిత్ మాధవేని, కరమా ఇంచార్జ్ శ్రీకాంత్ దొనకంటి ఉన్నారు.
అలాగే గత కొన్నిరోజులనుండి వారికి సహాయం అందిస్తున్న సోషల్ సర్వీస్ ఫర్ గల్ఫ్ ఇండియన్స్ అధ్యక్షులు జైత నారాయణ మరియు సునీల్ గౌడ్ దొమ్మాటి,మల్లేష్, రాజు, అలాగే వసతి ఏర్పాటు చేయడానికి సహకరించిన కచ్చు కొమురయ్య(దుబాయి ఎల్లాల శీనన్న సేవాసమితి సలహాదారులు), విట్టల్ అన్న, ఈరోజు భోజనం అందించిన మహేష్, మల్లేష్, ఆర్థికసహాయం చేసిన పరుశురాం తదితరులు కలిశారు.
కరోనా ప్రభావం వలన ఎంతోమంది ఉద్యోగం కోల్పోయి పనులులేక రోడ్డునపడ్డారు, అన్ని గల్ఫ్ దేశాల్లో ఇంకా ఎంతో మంది తెలంగాణ, ఆంధ్ర సోదరులు బాధితులుగా మారే అవకాశం ఉంది కావున ప్రభుత్వం చొరవ చూపి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అందరిని ఆదుకునే విధంగా సంబంధిత ఎంబసీలతో సహాయం అందేవిధంగా చూడాలని కోరుకుంటున్నారు.
బాధితుల వివరాలు:
1)కుమ్మరి గోపాల్( మిట్టకోడూరు, వికారాబాద్ జిల్లా,తెలంగాణ)
2) సంతోష్( బీంగాల్ మండలం, తాల్లపెళ్లి,నిజామాబాద్ జిల్లా,తెలంగాణ)
3) శ్రీను (బీంగల్ మండలం, తాల్లపెళ్లి,నిజామాబాద్ జిల్లా,తెలంగాణ)
4) లింగారెడ్డి (అంశపూర్,నిజామాబాద్ జిల్లా,తెలంగాణ)
5) రాజు (పచ్చిమగోదావరి జిల్లా,ఆంధ్రప్రదేశ్)
6) శ్రీనివాస్ (పచ్చిమగోదావరి జిల్లా ,ఆంధ్రప్రదేశ్)
7) వెంకట్ (తూర్పుగోదావరి జిల్లా ,ఆంధ్రప్రదేశ్)
8)మురళి మోహన్ (పచ్చిమగోదావరి జిల్లా ,ఆంధ్రప్రదేశ్)
9) లక్ష్మిరాజాం (పల్లిమక్కా గ్రామం, రాజన్న సిరిసిల్ల జిల్లా,తెలంగాణ)
10)రాజేంద్ర ప్రసాద్ (జైపూర్,రాజస్థాన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు