తెలంగాణ:229కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు
- April 03, 2020
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. ఇవాళ(03 ఏప్రిల్ 2020) ఒక్కరోజే రాష్ట్రంలో భారీగా 75 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజే ఏకంగా ఇద్దరు కరోనా పేషెంట్లు చనిపోయారు. షాద్‌నగర్‌లో ఒకరు, సికింద్రాబాద్‌లో కరోనా మరణాలు నమోదయ్యాయి.
ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో రికార్డైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 229కి చేరుకుంది. చనిపోయిన వారి సంఖ్య 11కి చేరుకోగా.. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 15 అయ్యింది. వారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 32 మంది కరోనాను జయించారు.
ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 186 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారి ఫ్యామిలి మెంబర్స్, సన్నిహితులను కలుపుకుని నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!