రెడ్‌అలర్ట్ ప్రాంతంగా విశాఖ నగరం
- April 04, 2020
విశాఖపట్నం: కరోనా ముప్పు ఉన్న జాబితాలోకి విశాఖ నగరం చేరింది. ఇప్పటికే కేంద్రం 29 హాట్ స్పాట్‌లను గుర్తించింది. పెరిగే వైరస్ తీవ్రత దృష్ట్యా 8 రాష్ట్రాల పరిధిలోని మరికొన్ని జిల్లాలను గుర్తించగా, విశాఖ ఆ జాబితాలో చేరింది. దీంతో రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ప్రీతి సూడాన్ తెలిపారు. ఇదే జాబితాలోకి బిహార్‌లోని ముంగేర్, చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, ఢిల్లీలోని న్యూఢిల్లీ, హరియాణాలోని ఫరీదాబాద్, తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలున్నాయని తెలిపారు. ఇవన్నీ పెరగడానికి ఢిల్లీ లింకులే కారణమని పేర్కొంటున్నారు. ఏపీలో కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో వ్యాప్తి చెందుతోంది. బుధవారం ఇద్దరికి, గురువారం 21 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. శుక్రవారం మరో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు