DRDO అద్భుతం...డిసిన్ఫెక్షన్ ఛాంబర్, మాస్క్‌ల తయారీ
- April 05, 2020
న్యూఢిల్లీ: కరోనా వైరస్(కోవిడ్-19)పై జరుగుతున్న పోరాటంలో భాగంగా డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) అత్యుత్తమమైన డిసిన్ఫెక్షన్ ఛాంబర్, ప్రత్యేకమైన మాస్కులు తయారు చేసే పనిలో పడింది. అహ్మద్‌నగర్‌లోని డీఆర్డీఓ ల్యాబ్‌లో ఈ డిసిన్ఫెక్షన్ ఛాంబర్‌ని తయారు చేశారు. ఇందులోకి సబ్బు, శానిటైర్లను అమర్చారు. వ్యక్తి తొలుత ఇందులోకి అడుగుపెట్టగానే.. అతనిపై ఉన్న కలుష్య పదార్థలను తొలగించేందుకు.. సోడియం క్లోరైడ్‌ను స్ప్రై చేస్తారు. ఇది 25 సెకన్లపాటు జరిగి ఆ తర్వాత ఆగిపోతుంది. అయితే ఈ ఛాంబర్‌ను నడిచి వెళ్లే వ్యక్తి కచ్చితంగా కళ్లు మూసుకొని ముందుకు వెళ్లాలి. ఇందులో అమర్చిన ట్యాంకు సామర్థ్యం 700లీటర్లు.. అంటే రిఫిల్లింగ్ చేయకుండానే ఇందులో నుంచి 650 మంది శుభ్రంగా బయటకు వెళ్లొచ్చు. ఎక్కువ రద్దీగా ఉండే మాల్స్, ఆస్పత్రులు, కార్యాలయాలు, తదితర ప్రాంతాల వద్ద వీటిని అమర్చితే.. ఎవరికీ వైరస్ సోకకుండా కట్టడి చేయవచ్చని అధికారులు అంటున్నారు.
Another innovation by @DRDO_India Ahmednagar based VRDE lab makes fullbody disinfection chamber#COVIDー19 #Covid_19india pic.twitter.com/KicR1zQqa6
— Neeraj Rajput (@neeraj_rajput) April 4, 2020
ఇక కరోనా రోగులకు సేవలు చేస్తున్న వైద్య సిబ్బంది ధరించేందుకు ఓ ప్రత్యేకమైన మాస్క్‌ను హైదరాబాద్, ఛండీగఢ్ డీఆర్డీఓ శాఖలకు చెందిన సిబ్బంది తయారు చేశారు. తల మొత్తాన్ని కప్పి ఉంచే విధంగా రూపొందించే ఈ మాస్కు చాలా తేలికగా ఉండి.. ఎక్కుగా కాలం మన్నేలా రూపొందించారు. ఇప్పటికే ఛంఢీగఢ్‌లో వెయ్యి మాస్కులను తయారు చేసి.. స్థానిక పీజీఐఎంఈఆర్‌కి అందించారు. హైదరాబాద్‌లోనూ 100 మాస్కులను ఈఎస్ఐసీకి అందించారు. అక్కడి సిబ్బంది వీటిని వాడిన తర్వాత మిగితా వాటిని తయారు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు