ఎంపీల జీతాల్లో కోత, ఏడాదిపాటు, ఎంపీల్యాడ్స్ రెండేళ్లు కట్

- April 06, 2020 , by Maagulf
ఎంపీల జీతాల్లో కోత, ఏడాదిపాటు, ఎంపీల్యాడ్స్ రెండేళ్లు కట్

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి రాబడి తగ్గిపోవడంతో ఎంపీల జీతాల్లో భారీగా కోత విధించింది. ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, ఎంపీల జీతాల్లో ఏడాదిపాటు 30శాతం కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఆమోదించింది.

ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఎంపీలందరి జీతాల్లో ఏప్రిల్ నెల నుంచి ఏడాదిపాటు కోత విధించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. అంతేగాక, రెండేళ్లపాటు ఎంపీ లాడ్స్ నిధులు కూడా మంజూరు చేయలేమని స్పష్టం చేశారు.

ఇక మాజీ ఎంపీల పెన్షన్ లోనూ 30 శాతం కోత పడనుంది. ఈ మేరకు పార్లమెంటు సభ్యుల జీతాలు, పెన్షన్ల చట్టం-1954ను సవరిస్తూ.. సోమవారం కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోద ముద్ర వేసింది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్రాల గవర్నర్లకు కూడా ఏడాదిపాటు 30 శాతం తక్కువ జీతం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ నిధులన్నీ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకు వెళ్తాయని కేంద్రమంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com