కరోనా నివారణకు రామ్ తళ్లూరి 5.5 లక్షల విరాళం
- April 07, 2020
కరోనా వైరస్ బాధితుల సహాయార్థం అలానే కరోనా నివారణకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలకు తమ వంతు సహాయార్ధం పలువురు పారిశ్రామికవేత్తలు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనా పై పోరాటానికి ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త రామ్ తళ్లూరి కూడా ముందుకొచ్చారు. 5.5 లక్షల రూపాయలు విరళాన్ని ప్రకటించారు. ఈ మొత్తంలో 5 లక్షల రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి మరో యాభై వేలు విలువ చేసే నిత్య అవసరాల సరుకులు సినీ కార్మీకులకు అందించారు. తాను అధినేతగా వ్యవహరిస్తున్న లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్కై జోన్ ఇండియా సంస్ధలు తరుపున రామ్ తళ్లూరి ఈ విరాళం అందించడం జరిగింది. గత నెలలో తన కంపెనీ పని మీద అమెరికా వెళ్లిన రామ్ తళ్లూరి లాక్ డౌన్ నేపథ్యంలో అక్కడే నిలిచిపోయారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..