కరోనాపై పోరాటం:అబుధాబిలో పెన్ శానిటైజర్స్ రూపొందించిన ఇండియన్ విద్యార్థులు
- April 07, 2020
అబుధాబి:వినూత్న ఆవిష్కరణతో వైరస్ వ్యాప్తి నియంత్రణ పోరాటంలో ఇండియన్ విద్యార్థులు భాగస్వామ్యులు అవుతున్నారు. అబుధాబి లో ఉంటున్న ఇద్దరు ఇండియన్ విద్యార్థులు చిన్న ఆలోచనతో రూపొందించిన పెన్ శానిటైజర్ ఇప్పుడు వారు ఉంటున్న అపార్ట్మెంట్ వాసులకు పెద్ద రిలీఫ్ పరికరంగా మారింది. ఓ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్న అక్కాతమ్ముళ్లు భవిక కొత్తపల్లి, ప్రకెత్ కొత్తపల్లి ఈ పెన్ శానిటైజర్లను రూపొందించారు. ఈ కరోనా హాలిడేస్ దాదాపు 150 వరకు పెన్ శానిటైజర్లను తయారు చేసి తమ అపార్టెంట్ లోని తోటి నివాసితులకు పంచిపెట్టారు.
భవిక, ప్రకెత్ తమ అపార్ట్మెంట్ లోని వారు లిఫ్ట్ బటన్, డోర్ బెల్స్ కామన్ గా వాడటాన్ని గమనించారు. కనీస దూరం(ఫిజికల్ డిస్టెన్స్) పాటిస్తున్నా..ఇలా కామన్ బటన్స్ ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉండటంతో చాలా వరకు పెన్నులతో బటన్స్ ను ప్రెస్ చూస్తున్నారు. అయితే..పెన్నుతో ప్రెస్ చేసి వాటిని మళ్లీ జేబులో పెట్టుకోవటంతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని గమనించిన తామకు పెన్ను శానిటైజర్ ఐడియా వచ్చిందని ఎయిత్ గ్రేడ్ చదువుతున్న భవిక తెలిపింది. వాడిన పెన్నులను సేకరించి వాటిలో రీఫిల్ తీసేసి అందులో శానిటైజర్ ఫిల్ చేశామని, పెన్నుకు ఓ స్పాంజ్ క్యాప్ ఏర్పాటు చేశామని ఫిఫ్త్ గ్రేడ్ చదువుతున్న ప్రకెత్ పెన్ను శానిటైజర్ పనిచేసే విధానాన్ని వివరించాడు. లిఫ్ట్ బటన్స్, డోర్ బెల్స్ ను పెన్ను శానిటైజర్ తో ప్రెస్ చేసిన తర్వాత పెన్నుకు క్యాప్ పెట్టడంతో ప్రెజర్ వల్ల పెన్నులోని శానిటైజర్ బయటికి వచ్చి స్పాంజ్ క్యాప్ లోకి చేరుతుంది. దాంతో పెన్ను ముందుభాగంలోని వైరస్ నశించిపోతుందని ప్రకెత్ వివరించాడు.
పెన్ శానిటైజర్ ఐడియా వర్కౌట్ అవటంతో భవిక, ప్రకెత్ తండ్రి జనార్ధన్ వందల పెన్నులను సమకూర్చాడు. పిల్లలు తయారు చేసిన పెన్ను శానిటైజర్లను తనతో పని చేసే తోటి ఉద్యోగులతో పాటు తమ బిల్డింగ్ ఉంటున్న వారికి పంచాడు. ఇప్పుడు తన తోటి ఉద్యోగులు అంతా పెన్ శానిటైజర్లనే ఉపయోగిస్తున్నారని జనార్ధన్ గర్వంగా చెబుతున్నాడు. కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం యూఏఈ చేస్తున్న పోరాటంలో తమ పిల్లలు ఇద్దరు కూడా వినూత్న ఆవిష్కరణతో భాగస్వామ్యులు అవటం పట్ల భవిక, ప్రకెత్ తల్లి వనిత సంతోషం వ్యక్తం చేశారు. తమ పిల్లల పట్ల తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. వైరస్ పై అంతా కలికట్టుగా పోరాడాల్సిన సమయం ఇది అని అన్నారామె.
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!