రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన అక్షయ్
- April 10, 2020
కరోనా నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యలలో తనవంతు భాగంగా ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడు కోట్ల విరాళం అందజేసి మరోసారి సూపర్ స్టార్ అనిపించుకున్నారు అక్షయ్.
కరోనా నిర్మూలనలో భాగంగా అక్షయ్ కుమార్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్కు(పీపీఈ) ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. తమ కుటుంబాలని కంటికి రెప్పలా కాపాడుతున్న వైద్యులు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆర్మీ అధికారులు, వాలంటీర్లు.. తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సహాయానికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..