పెరిగిన గృహహింస కేసులు
- April 10, 2020
కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలన్నీ కోవిడ్-19 నియంత్రణకు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ అమలు చేస్తున్న దేశాలన్నింటిలో గృహహింస పెరుగుడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌తో ఉపాధి పోయిందన్న బాధ, నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితితో భర్తలు తమ అసహనాన్ని భార్యలపై చూపుతున్నట్లు కేసులను బట్టి తెలుస్తోంది. లాక్‌డౌన్‌తో భారత్‌లోనూ గృహహింస కేసుల సంఖ్య రెట్టింపు అయిందని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లలో ఉంటున్న పురుషులు తమ అసహనాన్ని భార్యలపై ప్రదర్శిస్తున్నారని.. నాలుగు గోడలకే పరిమితమైన మహిళలు తమ గోడును ఎవరికి, ఎలా చెప్పకోవాలో తెలియక సతమతమవుతున్నారని రేఖాశర్మ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, గృహిణులు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ +91 7217735372 ను కేటాయించింది. కోవిడ్-19, లాక్డౌన్ నేపథ్యంలో బాధలో ఉన్న లేదా గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు మద్దతు, సహాయం కోసం మహిళా కమిషన్ వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. లాక్డౌన్ ముగిసేవరకు మాత్రమే ఈ నంబర్ పనిచేస్తుందని వివరించింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







