సౌదీలో తెలంగాణ వ్యక్తిపై హత్య కేసు యోచన..షాపింగ్ మాల్ లో తుమ్మటమే అతని నేరం
- April 10, 2020
సౌదీ అరేబియా:కరోనా వైరస్ తో తుమ్మినా, దగ్గనా అతని వైపు అనుమానపు చూపులు సర్వసాధారణం అయ్యాయి ఇప్పుడు. ఆ తమ్ములే తెలంగాణకు చెందిన వ్యక్తని చిక్కుల్లో పడేశాయి. ఏకంగా అతనిపై హత్యాయత్నం కేసు నమోదయ్యే అవకాశానికి దారితాశాయి. తెలంగాణలోని జనగామకు చెందిన ఓ వ్యక్తి సౌదీలో ఉంటున్నాడు. ఇటీవలె స్వదేశానికి వచ్చి మళ్లీ సౌదీ వెళ్లాడు. అయితే..అతను షాపింగ్ చేసేందుకు ఈ నెల మొదటి వారంలో ఓ సూపర్ మార్కెట్ వెళ్లాడు. పదే పదే తమ్ముటం, దగ్గతూ కనిపించాడు. ఇదంతా అక్కడి అరబ్బూ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి గమనించింది. కరోనా వైరస్ పై అప్పటికే అవగాహన చర్యలు చేపట్టడంతో అప్రమత్తమైన ఆ అమ్మాయి జనగామ వ్యక్తి తుమ్ముతున్న విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సూపర్ మార్కెట్ కు చేరుకున్న పోలీసులు తెలంగాణకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు. టెస్టుల్లో కరోనా వైరస్ పాజిటీవ్ అని తేలటంతో అతనితో పాటు క్యాంపులో ఉంటున్న 47 మందిని నిర్బంధంలోకి(క్వారంటైన్) తరలించారు. వారందరికీ వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించగా..44 మందికి నెగటీవ్ వచ్చింది. అయితే..ముగ్గురి ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ముగ్గురిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి మిగిలిన 44 మందిని డిశ్చార్జ్ చేశారు. అయితే..కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా..వైరస్ సోకినట్లు తెలిసి ఆ విషయాన్ని దాచిపెట్టిన కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే సౌదీ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జనగామ వ్యక్తిపై హత్య కేసు నమోదు చేయాలని సౌదీ ప్రభుత్వం యోచిస్తోంది. ఇదిలాఉంటే జనగామ వ్యక్తి వెళ్లిన సూపర్ మార్కెట్ శానిటైజ్ (క్రిమిసంహారక మందు చల్లటం) చేశారు. అంతేకాదు అతను తాకిన ర్యాక్ లోని దాదాపు 35 లక్షల విలువైన సరుకులను ధ్వంసం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







