కరోనా నుంచి కోలుకుంటున్న ఇరాన్...
- April 11, 2020
కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తున్నది. అగ్రదేశాల్లో సైతం ఈ వైరస్ వణుకుపుట్టిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద 16,99,631 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,02,734 మంది మరణించారు. మరణాల సంఖ్యలో అమెరికా, ఇటలీ దేశాలు పోటీ పడుతున్నాయి. అయితే,గత కొన్ని రోజులుగా ఇటలీలో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఐసీయూ వార్డులపై కొంతమేరకు ఒత్తిడి తగ్గింది.
కానీ, అమెరికాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. ప్రతి రోజు మరణాల సంఖ్య రెండు వేలు ఉండటం ఆ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. న్యూయార్క్ నగరంలోనే ఈ సంఖ్య అత్యధికంగా ఉండటం విశేషం. అయితే,మిడిల్ ఈస్ట్ దేశాల్లో చూసుకుంటే ఇరాన్ లో పరిస్థితులు కాస్త కుదుటపడ్డాయి. ఇరాన్ లో 65వేలమంది పైగా కరోనా బారిన పడగా, 4,232 మంది మరణించారు. అయితే, ఇరాన్ లో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. కరోనా బాధితుల్లో సంగానికంటే ఎక్కువ మంది కరోనా నుంచి కోలుకున్నారు. 28 వేల కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వీరు కూడా త్వరలోనే కోరుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నది ఇరాన్.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







