తారక్ అభిమానులకి శుభవార్త..
- April 12, 2020
లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ తో పాటు సీరియల్స్, రియాలిటీ షోస్‌కి సంబంధించిన షూటింగ్స్ కూడా పూర్తిగా స్తంభించాయి. ఈ నేపథ్యంలో ఛానెల్స్ వారు గతంలో మంచి టీఆర్పీ రాబట్టిన కార్యక్రమాలని తిరిగి ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఆయా సమయంలో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 3 మాటీవీలో ప్రసారం అవుతుండగా, సీజన్ 1ని స్టార్ మాలో ప్రసారం చేయబోతున్నారు.
వెండితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై బిగ్ బాస్ కార్యక్రమంతో తన టాలెంట్ మరోసారి నిరూపించుకున్నారు. 70 రోజుల పాటు 12 మంది సెలబ్రిటీలతో కలిసి మంచి వినోదాన్ని అందించారు. అప్పట్లో ఈ షో అన్ని కార్యక్రమాల రికార్డులని చెరిపేస్తూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక ఈ రోజు సాయంత్రం నుండి ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 1 కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఎన్టీఆర్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్స్, రీట్వీట్స్ చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..