కువైట్:ప్రవాసీయుల నివాస అనుమతిపై తప్పుడు ప్రచారం..చర్యలకు సిద్ధమవుతున్న మంత్రిత్వ శాఖ
- April 13, 2020
కువైట్:సోషల్ మీడియా వేదికగా ఎలాంటి అసత్య ప్రచారాలు, అపోహలు సృష్టించేలా కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కువైట్ అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు నెటిజన్లు మాత్రం హద్దు దాటుతూనే ఉన్నారు. తాజాగా ప్రవాసీయుల నివాస అనుమతులకు సంబంధించి ఓ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. 40 ఏళ్లకు పైబడిన ప్రవాసీయులకు ఇక నివాస అనుమతులను పునరుద్ధరించరని ఆ కథనాల్లోని సారాంశం. ఈ నిరాధారమైన ప్రచారంపై అధికారులు విచారణ ప్రారంభించారు. అకౌంట్ వివరాలు, దాని నిర్వాహకులు ఎవరో గుర్తించే పనిలో ఉన్నారు. ఉప ప్రధాని అనల్ అల్ సలహ్ సూచనల మేరకు ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదని మరోసారి అధికారులు హెచ్చరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన