యూఏఈ: ప్రవాసీయులను అనుమతించని దేశాల పట్ల అసంతృప్తి .కార్మిక ఒప్పందాలపై పునరాలోచన

- April 13, 2020 , by Maagulf
యూఏఈ: ప్రవాసీయులను అనుమతించని దేశాల పట్ల అసంతృప్తి .కార్మిక ఒప్పందాలపై పునరాలోచన

ప్రవాసీయుల తరలింపులో చిక్కులు ఎదుర్కొంటున్న యూఏఈ..భాగస్వామ్య దేశాల తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. ఏయే దేశాలైతే తమ సొంత పౌరులను కూడా అనుతించటం లేదో ఆయా దేశాల పట్ల ఇక కఠినంగా వ్యవహరించాలనే యోచన చేస్తోంది. ఇందుకోసం కార్మిక ఒప్పందాలపై పునరాలోచన చేస్తున్నట్లు కూడా యూఏఈ వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తమ దేశంలోని ప్రవాసీయులను వారి వారి సొంత దేశాలకు తరలించేందుకు యూఏఈ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వివిధ ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులు ప్రస్తుత విపత్తు సమయంలో తమ సొంత దేశానికి వెళ్లాలని అనుకుంటున్నారని, అయితే..ఆయా దేశాలు తమ పౌరులకు అనుమతి ఇవ్వకపోవటం విచారకరమని యూఏఈ భాగస్వామ్య దేశాల తీరును తప్పుబట్టింది. ప్రవాసీయులను తరలించటంలో భాగంగా అనుమతిని కోరుతూ పదే పదే సంప్రదించినా భాగస్వామ్య దేశాల నుంచి ఎలాంటి స్పందన లేదన్న యూఏఈ..అలాంటి దేశాలతో ఇక కార్మిక ఒప్పందాలపై పునరాలోచన చేస్తామని సుతిమెత్తగా హెచ్చరించింది. భవిష్యత్తులోనూ ఆయా దేశాల నుంచి కార్మికులను అనుమతించబోమని కూడా వెల్లడించింది. ఇప్పటికే అమలులో ఉన్న కార్మిక ఒప్పందాలను కూడా రద్దు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని యూఏఈ పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com